Share News

యర్రవరం జలపాతం మూసివేత

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:34 PM

మండలంలోని గొందిపాకలు పంచాయతీ యర్రవరం జలపాతాన్ని రెవెన్యూ అధికారులు మూసివేశారు. వర్షాలు తగ్గే వరకు పర్యాటకులు ఇక్కడికి రావద్దని స్థానిక తహశీల్దార్‌ జి.ఆనందరావు తెలిపారు.

యర్రవరం జలపాతం మూసివేత
జలపాతానికి వెళ్లే మార్గాన్ని మూసివేసిన రెవెన్యూ ఉద్యోగులు, స్థానిక గిరిజనులు

వర్షాలు తగ్గే వరకు పర్యాటకులు రావద్దు

రెవెన్యూ అధికారుల హెచ్చరిక

చింతపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొందిపాకలు పంచాయతీ యర్రవరం జలపాతాన్ని రెవెన్యూ అధికారులు మూసివేశారు. వర్షాలు తగ్గే వరకు పర్యాటకులు ఇక్కడికి రావద్దని స్థానిక తహశీల్దార్‌ జి.ఆనందరావు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాగల ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా, మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసింది. గిరిజన ప్రాంతంలో ఉన్న జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, పర్యాటకుల సందర్శనలు నిలిపివేయాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఈ మేరకు గురువారం తహశీల్దార్‌ సిబ్బందిని యర్రవరం జలపాతానికి పంపించారు. జలపాతానికి వెళ్లే మార్గాన్ని మూసివేస్తూ కంచె కట్టేశారు. వర్షాలు తగ్గే వరకు జలపాతాన్ని సందర్శించేందుకు ఎవరినీ పంపించవద్దని స్థానిక గిరిజనులకు తెలియజేశారు. కాగా ప్రస్తుతం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది.

Updated Date - Aug 14 , 2025 | 11:34 PM