నేడు గిరిజన రిజర్వేషన్లపై వర్క్‌షాప్
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:27 PM
జీవో:3 రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ జీవో రూపకల్పనలో భాగంగా స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం గిరిజన సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో రిజర్వేషన్లపై వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
హాజరుకానున్న టీడబ్ల్యూ డైరెక్టర్ సదా భార్గవి
పాడేరు, జూలై 21(ఆంధ్రజ్యోతి): జీవో:3 రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ జీవో రూపకల్పనలో భాగంగా స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం గిరిజన సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో రిజర్వేషన్లపై వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవి అధ్యక్షతన నిర్వహిస్తారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించేందుకు సానుకూలంగా చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే అందరి అభిప్రాయాలు సేకరించి, గిరిజనులకు న్యాయం చేసేలా ప్రభుత్వం జీవో జారీ చేసిందుకు సన్నాహాలు చేస్తున్నది. గత వైసీసీ ప్రభుత్వానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం గిరిజనుల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ఉండడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.