Share News

22న గిరిజన రిజర్వేషన్లపై ఐటీడీఏలో వర్క్‌షాప్‌

ABN , Publish Date - Jul 19 , 2025 | 10:55 PM

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలతో ఈనెల 22న స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన రిజర్వేషన్లపై ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

22న గిరిజన రిజర్వేషన్లపై ఐటీడీఏలో వర్క్‌షాప్‌
డాక్టర్‌ అభిషేక్‌గౌడ

జేసీ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ

పాడేరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలతో ఈనెల 22న స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన రిజర్వేషన్లపై ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సదా భార్గవి అధ్యక్షతన 22న ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించే వర్క్‌షాప్‌నకు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి, ప్రజా, మహిళా సంఘాలకు చెందిన ప్రతినిధులు, విలేకరులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలు, కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొవాలని ఆయన కోరారు.

Updated Date - Jul 19 , 2025 | 10:56 PM