Share News

అస్వస్థతతో కార్మికుడి మృతి

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:37 AM

ఫార్మాసిటీలోని గ్లాండ్‌ ఫార్మా లిమిటెడ్‌ పరిశ్రమలో శుక్రవారం ఒక కార్మికుడు అస్వస్థతకు గురై మృతిచెందాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ ఆర్‌.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

అస్వస్థతతో కార్మికుడి మృతి
నాగేశ్వరరావు (ఫైల్‌ ఫొటో)

గ్లాండ్‌ ఫార్మాలో ఘటన

అనుమానస్పద మృతిగా కేసు నమోదు

పరవాడ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఫార్మాసిటీలోని గ్లాండ్‌ ఫార్మా లిమిటెడ్‌ పరిశ్రమలో శుక్రవారం ఒక కార్మికుడు అస్వస్థతకు గురై మృతిచెందాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ ఆర్‌.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి మండలం తుమ్మపాల ఇందిరా కాలనీకి చెందిన బావిరిశెట్టి నాగేశ్వరరావు (54) గత మూడేళ్లగా ఫార్మాసిటీలోని గ్లాండ్‌ ఫార్మా లిమిటెడ్‌ పరిశ్రమలో హౌస్‌ కీపింగ్‌ పనులు చేస్తున్నాడు. శుక్రవారం లోపల రోడ్డు క్లీనింగ్‌ పనులు చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్ప కూలిపోయాడు. తోటి కార్మికులు వెంటనే రాంకీ క్లినిక్‌కు తరలించారు. దారిలో పలుమార్లు వాంతులు చేసుకున్నాడు. ప్రథమ చికిత్స అనంతరం గాజువాకలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాజువాక వెళ్లి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 12 , 2025 | 12:37 AM