విశాఖ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషిచేయండి
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:39 AM
విశాఖ నగరం అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా పనిచేయాలని మేయర్ పీలా శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.
మేయర్ పీలాకు సీఎం చంద్రబాబు సూచన
విశాఖపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి):
విశాఖ నగరం అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా పనిచేయాలని మేయర్ పీలా శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, ఎమ్మెల్సీలతో ఆదివారం సీఎం సమావేశమయ్యారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధిపనులు, భవిష్యత్తు కార్యాచరణపై మేయర్ ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తున్నామని, నగరాభివృద్ధికి ప్రణాళికాద్ధంగా కృషిచేయాలని మేయర్‌ను ఆదేశించారు.