మహిళా క్రికెట్ సందడి
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:33 AM
మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీకి తొలిసారి వేదికగా నిలుస్తున్న పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం జరగనున్న మ్యాచ్‌లో ఆతిథ్య భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై, రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై వరుస విజయాలు సాధించిన భారత జట్టు గురువారం దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది.
ప్రపంచ కప్ టోర్నీకి తొలిసారి వేదికగా నిలుస్తున్న
ఏసీఏ-వీడీసీఏ స్టేడియం
నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య పోరు
విశాఖపట్నం, స్పోర్ట్స్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):
మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీకి తొలిసారి వేదికగా నిలుస్తున్న పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం జరగనున్న మ్యాచ్‌లో ఆతిథ్య భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై, రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై వరుస విజయాలు సాధించిన భారత జట్టు గురువారం దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ఇక తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిన దక్షిణాఫ్రికా....రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకుని న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించడంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు. టాస్ కీలకంగా మారే ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌కు 250కు పైగా స్కోరు చేసే అవకాశాలు ఉన్నాయి.
మహిళ ప్రేక్షకుల కోసం ప్రత్యేక చర్యలు
మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే మహిళా అభిమానుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేకంగా వాష్ రూమ్స్ ఏర్పాటు చేశారు. పురుషులతో నిమిత్తం లేకుండా ప్రత్యేక మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా అక్కడ తగిన భద్రత చర్యలు చేపట్టనున్నారు.
భారీ బందోబస్తు
స్టేడియం బయట, లోపల ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. అలాగే ట్రాఫిక్‌కు సంబంధించి ప్రత్యేక నిబంధనలు అమలు చేయనుంది.