పాముకాటుతో మహిళ మృతి
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:44 AM
మండల కేంద్రంలో ఒక మహిళ పాముకాటుకు గురై మృతిచెందారు. కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. మునగపాకకు చెందిన వేగి ఆదిలక్ష్మి (51) మంగళవారం సాయంత్రం పొలానికి వెళ్లారు. అక్కడ అరటి తోటలో పని చేస్తుండగా పాము కాటు వేసింది. కొద్దిసేపటి తరువాత పొలానికి వెళ్లిన పెద్ద కుమారుడు నాగేశ్వరరావు.. అపస్మారకస్థితిలో పడి వున్న తల్లిని చూసి ఆందోళన చెందాడు.
అరటి తోటలో పనులు చేస్తుండగా ఘటన
మునగపాక, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఒక మహిళ పాముకాటుకు గురై మృతిచెందారు. కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. మునగపాకకు చెందిన వేగి ఆదిలక్ష్మి (51) మంగళవారం సాయంత్రం పొలానికి వెళ్లారు. అక్కడ అరటి తోటలో పని చేస్తుండగా పాము కాటు వేసింది. కొద్దిసేపటి తరువాత పొలానికి వెళ్లిన పెద్ద కుమారుడు నాగేశ్వరరావు.. అపస్మారకస్థితిలో పడి వున్న తల్లిని చూసి ఆందోళన చెందాడు. నోటి నుంచి నురగ రావడం, కాలిపై పాము కాట్లు కనిపించడంతో వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు చెప్పారు. ఆదిలక్ష్మి భవానీ దీక్షలో ఉన్నారు. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యురాలిగా వున్న ఆదిలక్ష్మి మృతిచెందడం బాధాకరమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు టెక్కలి పరశరాం అన్నారు.