Share News

జీపు బోల్తా పడి మహిళ మృతి

ABN , Publish Date - May 13 , 2025 | 11:02 PM

పాడేరు- చింతపల్లి ప్రధాన రహదారి కె.కోడాపల్లి వద్ద మంగళవారం ఉదయం ప్రైవేటు జీపు బోల్తా పడి ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

జీపు బోల్తా పడి మహిళ మృతి
మృతురాలు లక్ష్మి (ఫైల్‌ ఫొటో)

మరొకరికి తీవ్ర గాయాలు

పాడేరు నుంచి వస్తుండగా ఘటన

జి.మాడుగుల, మే 13 (ఆంధ్రజ్యోతి): పాడేరు- చింతపల్లి ప్రధాన రహదారి కె.కోడాపల్లి వద్ద మంగళవారం ఉదయం ప్రైవేటు జీపు బోల్తా పడి ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. చింతపల్లి మండలం చవుడుపల్లి పంచాయతీ చిన్నకొత్తూరు గ్రామానికి చెందిన సీదరి రంగారావు, అతని భార్య లక్ష్మి(30) సోమవారం రాత్రి పాడేరు మోదకొండమ్మ జాతరకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు జీపులో స్వగ్రామానికి వస్తుండగా కె.కోడాపల్లి వద్ద ఆ జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సీదరి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త రంగారావుకు తీవ్ర గాయాలు కావడంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. జీపులో ఉన్న మిగతా ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. కాగా బాధితుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 13 , 2025 | 11:02 PM