బెల్లం ధరకు రెక్కలు
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:55 AM
స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డులో మంగళవారం బెల్లం ధరలు రికార్డుస్థాయిలో పెరిగాయి. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకటో రకం వంద కిలోలు రూ.6,090 పలికింది. గతంలో ఎన్నడూ రూ.5,500 దాటిన దాఖలాలు లేవు. సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్ యార్డుకు కొత్త బెల్లం రాక మొదలైంది.
వంద కిలోలు రూ.6,090
ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో సరికొత్త రికార్డు
అనకాపల్లి టౌన్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డులో మంగళవారం బెల్లం ధరలు రికార్డుస్థాయిలో పెరిగాయి. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకటో రకం వంద కిలోలు రూ.6,090 పలికింది. గతంలో ఎన్నడూ రూ.5,500 దాటిన దాఖలాలు లేవు. సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్ యార్డుకు కొత్త బెల్లం రాక మొదలైంది. మంగళవారం 871 బెల్లం దిమ్మలు వచ్చాయి. వీటిలో ఒకటో రకం 498, రెండో రకం 244, నల్ల బెల్లం 129 దిమ్మలు వున్నాయి. ఒకటో రకం క్వింటా రూ.6.090 పలకగా రెండో రకం రూ.4,600లు, మూడో రకం రూ.4 వేలు పలికినట్టు మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. యార్డుకు వస్తున్న బెల్లంతో పోలిస్తే డిమాండ్ ఎక్కువ వుండడంతో ధరలు పెరుగుతున్నాయని వర్తకులు చెబుతున్నారు. నాగుల చవితి వరకు బెల్లం ధరలు ఇంచుమించు ఇదే విధంగా వుంటాయని విశ్లేషిస్తున్నారు.