Share News

యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:56 AM

ఎన్‌డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

యువతకు విస్తృతంగా  ఉద్యోగ అవకాశాలు

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి):

ఎన్‌డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. కైలాసపురం సాగర్‌మాల కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం నిర్వహించిన రోజ్‌గార్‌ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 52 మంది యువతీ, యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, విశాఖపట్నం రైల్వే డీఆర్‌ఎం లలిత బోహోరా, ఏడీఆర్‌ఎం మనోజ్‌కుమార్‌ సాహు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 12:56 AM