Share News

టీడీపీ అధ్యక్ష పీఠం ఎవరికో!

ABN , Publish Date - Dec 17 , 2025 | 01:12 AM

తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది. అధ్యక్ష పదవి భర్తీపై పార్టీ అధిష్ఠానం గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నది. అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న వారిపై ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేసింది. ఈ పదవిని పలువురు ఆశిస్తున్నప్పటికీ ప్రధానంగా ముగ్గురు పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

టీడీపీ అధ్యక్ష పీఠం ఎవరికో!
కోట్ని బాలాజీ

అధిష్ఠానం పరిశీలనలో ముగ్గురి పేర్లు

అనకాపల్లి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది. అధ్యక్ష పదవి భర్తీపై పార్టీ అధిష్ఠానం గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నది. అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న వారిపై ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేసింది. ఈ పదవిని పలువురు ఆశిస్తున్నప్పటికీ ప్రధానంగా ముగ్గురు పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ కోట్ని బాలాజీ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఆయనతోపాటు ప్రస్తుత అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మరో సీనియర్‌ నేత మాదంశెట్టి నీలబాబు పేర్లను కూడా పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Updated Date - Dec 17 , 2025 | 01:12 AM