Share News

దూర విద్య ఫలితాలెన్నడో?

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:57 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దూర విద్య ఫలితాలెన్నడో?

ఈ ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహించిన ఏయూ

తాజాగా ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ

సుమారు 12 వేల మంది విద్యార్థుల నిరీక్షణ

ఉన్నత విద్యా కోర్సుల్లో చేరలేకపోతున్నామని ఆవేదన

విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నిదర్శనంగా ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన దూరవిద్య పరీక్షల ఫలితాలను ఇప్పటికీ విడుద ల చేయకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఫలితాలు వెలువడక ఉన్నత విద్యా కోర్సుల్లో చేరే అవకాశం కోల్పోయామని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు.

సాధారణంగా పరీక్షలు నిర్వహించిన 25 నుంచి 30 రోజుల్లో ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. అందుకు విరుద్ధం గా దూరవిద్య పరీక్షలు జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఫలితాలను వెల్లడించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ఉన్నత చదువుల కోసం ఆరాటపడే వారంతా ఆశలు వదులుకునే పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెలలు గడుస్తున్నా..

ఈ ఏడాది మార్చిలో దూరవిద్య డిగ్రీ, పీజీ సెమిస్టర్‌, సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఆయా కోర్సులకు సంబంధించి సుమారు 12 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరంతా ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పరీక్షలు ముగిసినప్పటి నుంచి ఫలితాల కోసం ఎదురుచూస్తు న్నారు. నెలలు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. జాప్యానికి కారణాలపై అధికారులను ప్రశ్నిస్తున్నా సమాధానం లభించడం లేదంటున్నారు. ఎప్పుడు ఫలితాలు విడుదల చేస్తారో కూడా స్పష్టత ఇవ్వడం లేదని వాపోతున్నారు.

ప్రారంభమైన మూల్యాంకనం..

దూరవిద్య విద్యార్థుల నుంచి ఫలితాలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తుండడంతో అధికారులు తాజాగా అప్రమత్తమ య్యారు. గత వారం రోజులుగా మూల్యాంకనం ప్రక్రియ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. పరీక్షలు ముగిసి ఐదు నెలలు దాటింది. ఇప్పటివరకు జవాబుపత్రాల మూల్యాం కనం చేయకుండా అధికారులు ఏం చేశారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ దశలో ఎప్పుడు ఫలితాలు వెల్లడిస్తారో తెలియని పరిస్థితి. దీనిపై ఏయూ దూర విద్య డైరెక్టర్‌ అప్పలనాయుడును వివరణ కోరగా.. సాంకేతిక కారణాలతో మూల్యాంకనం ఆలస్యమైందన్నారు. ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించామని, కొద్దిరోజుల్లో ఫలి తాలు వెల్లడిస్తామన్నారు.

విద్యార్థుల నిరీక్షణ..

ఏయూ దూర విద్య కోర్సులకు డిమాండ్‌ ఉంది. దీంతో అనేక వర్సిటీల్లో ఈ అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ చేరేం దుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారిలో బీఏ, బీకాం, బీఎస్సీ, ఎమ్మెస్సీ సైకాలజీ, తెలుగు తదితర కోర్సుల్లో చేరిన విద్యార్థులున్నారు.

Updated Date - Sep 22 , 2025 | 12:57 AM