సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:20 PM
సంక్షేమం, అభివృద్ధిని ఏకతాటిపై నడిపించడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
కూటమి పాలనలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
పలు రహదారులకు శంకుస్థాపన
పాయకరావుపేట రూరల్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధిని ఏకతాటిపై నడిపించడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మండలంలోని రాజగోపాలపురం నుంచి కందిపూడి, పాయకరావుపేట నుంచి మంగవరం, గుంటపల్లి నుంచి ఒడ్డిమెట్ట మీదుగా ఎన్‌హెచ్-16 రోడ్డుకు వెళ్లే రహదారుల నిర్మాణానికి శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. అలాగే గుంటపల్లిలో సుమారు రూ.21.8 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని, సుమారు రూ.25 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో రాజగోపాలపురం నుంచి కందిపూడి వరకు నాబార్డు నిధులు సుమారు రూ.60 లక్షలతో 2.2 కిలోమీటర్ల రోడ్డును, గుంటపల్లి నుంచి ఎన్‌హెచ్-16 వరకు నాబార్డు నిధులు సుమారు రూ.85 లక్షలతో 2 కిలోమీటర్ల రోడ్డు, పాయకరావుపేట నుంచి మంగవరం రోడ్డు సుమారు కోటి రూపాయలతో 5 కిలోమీటర్ల రోడ్డును నిర్మిస్తున్నట్టు ఆమె తెలిపారు. పాయకరావుపేట పట్టణంలో త్వరలోనే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామన్నారు. కూటమి పాలనలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు. గత వైసీపీ పాలనలో కనీసం రోడ్లు, డ్రైనేజీలను కూడా నిర్మించలేదన్నారు. ఈ సందర్భంగా మహిళలు పలు సమస్యలను హోం మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అఽధ్యక్షుడు చించలపు ప్రదీప్, పట్టణ అధ్యక్షుడు యాళ్ళ వరహాలు, జనసేన నాయకుడు గెడ్డం బుజ్జి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ, పీఆర్ ప్రాజెక్ట్సు డీఈఈ కుమారరాజా, తహశీల్దార్ ఎస్.ఎ.మహేశ్వరరావు, ఎంపీడీవో విజయలక్ష్మి, ఏపీవోలు నానిబాబు, శ్రీనువాసరావు, టీడీపీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్, పెదిరెడ్డి చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.