కొత్త టీచర్లకు వెబ్ కౌన్సెలింగ్
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:32 AM
మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా పాఠశాలలు కేటాయించనున్నారు. ఇందుకుగాను గురువారం వెబ్ ఆప్షన్స్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నారు. బుధవారమే వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం ఇస్తామని తొలుత ప్రకటించారు. అయితే ఖాళీల సమాచారం అందడం ఆలస్యం కావడంతో గురువారానికి వాయిదా వేశారు. గురువారం వెబ్ ఆప్షన్స్ పూర్తయిన తరువాత శుక్రవారం పాఠశాలలు కేటాయించనున్నారు. అదేరోజు నియామక ఉత్తర్వులు అందిస్తారు.
నేడు ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం
రేపు పాఠశాలల కేటాయింపు...నియామక ఉత్తర్వులు
తొలుత ఏజెన్సీలో ఖాళీల భర్తీపై విద్యా శాఖ దృష్టి
విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):
మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా పాఠశాలలు కేటాయించనున్నారు. ఇందుకుగాను గురువారం వెబ్ ఆప్షన్స్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నారు. బుధవారమే వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం ఇస్తామని తొలుత ప్రకటించారు. అయితే ఖాళీల సమాచారం అందడం ఆలస్యం కావడంతో గురువారానికి వాయిదా వేశారు. గురువారం వెబ్ ఆప్షన్స్ పూర్తయిన తరువాత శుక్రవారం పాఠశాలలు కేటాయించనున్నారు. అదేరోజు నియామక ఉత్తర్వులు అందిస్తారు.
ఉమ్మడి జిల్లాలో ఐదుచోట్ల కొత్త టీచర్లకు ఈనెల మూడో తేదీ నుంచి శిక్షణ ఇస్తున్నారు. ఆరోజు నుంచి సర్వీస్ ప్రారంభం అయినట్టే. కాగా ఉమ్మడి జిల్లాలో 1,134 పోస్టులకు భర్తీచేశారు. అందులో 400 పోస్టులు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఏజెన్సీ పాఠశాలల్లోనివి. ఇక మునిసిపల్ పరిధి తప్ప జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా ఖాళీలు ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించింది. తొలుత ఏజెన్సీలో మొత్తం ఖాళీలు భర్తీచేసిన తరువాత మైదానంపై దృష్టిసారించనున్నారు. ఎస్జీటీ కేటగిరీ వరకు చూస్తే డీఎస్సీ ద్వారా నియమితులైన టీచర్లకు పోస్టింగ్స్ ఇచ్చిన తరువాత కూడా ఖాళీలు ఉంటాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.