జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:07 AM
కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నాలుగు వారాల ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ వివరించారు.
నాలుగు వారాలపాటు కార్యక్రమాలు
కలెక్టర్ హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నాలుగు వారాల ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ వివరించారు. శుక్రవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై కార్యక్రమం ఈనెల 22న ప్రారంభమైందన్నారు. ఈనెల 25 నుంచి 29 వరకు సేవింగ్స్‌పై, 30 నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు వ్యవసాయం, ఇతర వృత్తులు, అక్టోబరు 7 నుంచి 13 వరకూ విద్య, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎలకా్ట్రనిక్స్, అక్టోబరు 14 నుంచి 18 వరకు టూరిజం, సేవా రంగం, రెన్యుబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్ తదితర అంశాలపై షాపింగ్‌మాల్ ఫెస్టివల్ నిర్వహిస్తామని వివరించారు.