ఉక్కు పరిరక్షణకు చిత్తశుద్ధితో ఉన్నాం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:42 AM
విశాఖ స్టీల్‌ప్లాంటు పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టంచేశారు.
కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
రాజమహేంద్రవరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):
విశాఖ స్టీల్‌ప్లాంటు పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టంచేశారు. అయినా పదేపదే తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ ఉంటే అలాంటి వారి చిత్తశుద్ధిని తాము అనుమానించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక హోటల్‌లో బీజేపీ గోదావరి జోన్ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల ప్రశిక్షణ తరగతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రూ.11,500 కోట్ల ప్యాకేజీ మంజూరు చేయడమే తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విశాఖ ఉక్కు సెంటిమెంట్‌ను సీఎం చంద్రబాబునాయుడు...కేంద్ర మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు చెప్పడం ద్వారా ప్యాకేజీ సాధించామని ఆయన పేర్కొన్నారు.
సంకల్ప్‌తో సంసిద్ధం
ఇంటర్‌లో మెరుగైన ఫలితాల సాధనకు 50 రోజుల యాక్షన్‌ప్లాన్
ఉదయం తరగతులు, మధ్యాహ్నం సాధన
జిల్లాలో 10 జూనియర్ కళాశాలలు, 5,358 మంది విద్యార్థులు
మద్దిలపాలెం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):
ఇంటర్ విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన సంకల్ప్-2026 కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైంది. ఇంటర్‌బోర్డు విడుదల చేసిన 50 రోజుల ప్రణాళికతో కూడిన షెడ్యూల్ ప్రకారం బోధన చేపడుతున్నారు. ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు బోర్డు అందించిన షెడ్యూల్‌ను జిల్లాలోని పది జూనియర్ కళాశాలల్లో పక్కగా అమలు చేయాలని ప్రిన్సిపాల్స్‌కు ఇప్పటికే జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి పి.ఉమారాణి ఆదేశాలిచ్చారు.
సంకల్ప్-2026 ప్రణాళిక ప్రకారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.40 గంటల వరకూ పాఠ్యాంశాలను బోధిస్తారు. మధ్యాహ్నం 1.20 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధన, ఇతర టెస్ట్‌లు నిర్వహణ. డిసెంబరు 15 నుంచి ఫిబ్రవరి 20 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. డిసెంబరు 22 నుంచి ఫిబ్రవరి 20 వరకు ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తారు. కాగా జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 5,358 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా ఉత్తీర్ణత సాధించేలా డీఐఈవో ఉమారాణి ప్రత్యేక దృష్టిసారించారు.
నాలుగు కేటగిరీలు..
సంకల్ప్-26లో భాగంగా జిల్లాలో ఇంటర్ ఉత్తీర్ణత శాతం మెరుగుపరచడానికి పటిష్ఠ చర్యలు చేపట్టారు. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఎ,బి,సి,డి కేటగిరీలుగా విభజించారు. ఎ కేటగిరీ విద్యార్థులకు ప్రత్యేక రివిజన్ క్లాసులు, బీ, సీ, డీ కేటగిరీ విద్యార్థులు లాంగ్ ఆన్సర్, రెండు షార్ట్ ఆన్సర్ ప్రశ్నలను నేర్చుకునే విధంగా బోధన పద్ధతులు అమలుచేస్తున్నారు. పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలను ఇంటర్ బోర్డు తయారుచేసి కళాశాలలకు మెటీరియల్ పంపింది. దీనిని అధ్యాపకులు విద్యార్థులకు అర్థమయ్యేవిధంగా బోధించి, సాధన చేయించాలి.
పక్కాగా అమలుచేస్తాం
ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశపెట్టిన సంకల్ప్-2026ను జిల్లాలోని అన్ని కళాశాలల్లో పక్కగా అమలుచేస్తాం. బోర్డు విడుదల చేసిన షెడ్యూల్‌ను జూనియర్ కళాశాలలకు పంపించి, ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించాం. వెనుకబడిన విద్యార్థులకు లాంగ్, షార్ట్ ప్రశ్నలు నేర్పించి పరీక్షలకు సిద్ధం చేస్తాం. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాల సాధనకు కృషి చేస్తున్నాం.
- పి.ఉమారాణి, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి.