Share News

పెద్దేరు, కోనాం ఆయకట్టుకు నీరు విడుదల

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:33 AM

మాడుగుల మండలం పెద్దేరు, చీడికాడ మండలం కోనాం జలాశయాల నుంచి కాలువలకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హాజరై పూజలు నిర్వహించారు.

పెద్దేరు, కోనాం ఆయకట్టుకు నీరు విడుదల
పెద్దేరు జలాశయం వద్ద నీటి విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, అధికారులు

మాడుగుల/ చీడికాడ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మాడుగుల మండలం పెద్దేరు, చీడికాడ మండలం కోనాం జలాశయాల నుంచి కాలువలకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం గేట్లు ఎత్తి కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పెద్దేరు జలాశయం వద్ద ఆయన మాట్లాడుతూ, కాలువల ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.69 కోట్లు మంజూరు చేసిందని, ఖరీఫ్‌ సీజన్‌ ముగిసేలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, కాలువలకు నీటి విడుదల ఆపేసిన అనంతరం డిసెంబరులో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌నాటికి పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు. ఆయకట్టుకు ఏటా రెండు పంటలకు నీరు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:33 AM