డొంకరాయి నుంచి నీరు విడుదల
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:49 PM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల ఆదివారం కూడా కొనసాగిందని జెన్‌కో అధికారులు తెలిపారు.
1,034.60 అడుగుల వద్ద స్థిరంగా నీటిమట్టం కొనసాగేలా చర్యలు
సీలేరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల ఆదివారం కూడా కొనసాగిందని జెన్‌కో అధికారులు తెలిపారు. జలాశయంలో నీటిమట్టం 1,034.60 అడుగుల వద్ద స్థిరంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే నీటిమట్టం పెరగకుండా జలాశయం నుంచి దిగువకు వెయ్యి క్యూసెక్కుల నీటిని, అలాగే పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి పవర్ కెనాల్ ద్వారా మరో 4 నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు జెన్‌కో అధికారులు తెలిపారు.