Share News

వరాహ పుష్కరిణికి జలహారతి

ABN , Publish Date - Nov 06 , 2025 | 01:27 AM

కార్తీక పౌర్ణమి సందర్భంగా సింహాచలంలోని వరాహ పుష్కరిణికి బుధవారం జల హారతి ఇచ్చారు. దేవస్థానం ఉపాలయం నుంచి పద్మావతీ, అలివేలు మంగా సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు.

వరాహ పుష్కరిణికి జలహారతి

కార్తీక పౌర్ణమి సందర్భంగా సింహాచలంలోని వరాహ పుష్కరిణికి బుధవారం జల హారతి ఇచ్చారు. దేవస్థానం ఉపాలయం నుంచి పద్మావతీ, అలివేలు మంగా సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. స్వామికి ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు షోడశోపచారాలు ఇచ్చిన అనంతరం పుష్కరిణికి ఏక, ద్వయ, సప్త, కుంభ, నక్షత్ర తదితర దశ హారతులను సమర్పించారు. అశేష సంఖ్యలో హాజరైన భక్తులు దీపాలు వెలిగించి పుష్కరిణిలో విడిచిపెట్టారు.

Updated Date - Nov 06 , 2025 | 01:27 AM