సర్పా, వరహా నదులకు జలకళ
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:45 AM
: ఏజెన్సీతోపాటు దానికి ఆనుకుని వున్న మైదానం ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు పడడంతో వరహా, సర్పా నదులకు జలకళ వచ్చింది. ఈ రెండు నదుల పరివాహక ప్రాంతాలైన రావికమతం, రోలుగుంట, కొయ్యూరు, జి.మాడుగుల మండలాల్లో గత వారం రోజుల్లో భారీ వర్షాలు కురిశాయి.
కోటవురట్ల, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీతోపాటు దానికి ఆనుకుని వున్న మైదానం ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు పడడంతో వరహా, సర్పా నదులకు జలకళ వచ్చింది. ఈ రెండు నదుల పరివాహక ప్రాంతాలైన రావికమతం, రోలుగుంట, కొయ్యూరు, జి.మాడుగుల మండలాల్లో గత వారం రోజుల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రెండు రోజుల క్రితం నదుల్లో స్వల్పంగా నీరు ప్రవహించింది. ఆదివారంనాటికి ఇది మరింత పెరిగింది. మే నెల చివరి వారం, జూన్ మొదటి వారంలో సర్పా, వరహా నదుల్లో వర్షంనీరు ప్రవహించడం ఇంతవరకు చూడలేదని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు. దీనివల్ల భూ గర్భ జలాలు వృద్ధి చెంది, వ్యవసాయ బోర్లు నుంచి పుష్కలంగా నీరు వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.