కొట్టుకుపోయిన జాతీయ రహదారి
ABN , Publish Date - Jul 25 , 2025 | 10:44 PM
మండలంలోని ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
జి.మాడుగుల: మండలంలోని ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుంబిడిసింగి పంచాయతీ అండంగిసింగి, రాళ్లగెడ్డలు మార్గంలో ప్రమాద స్థాయికి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి వంజరి సమీపంలో జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.