ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:30 AM
ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం
గోపాలపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):
విజయనగరం జిల్లా పర్యటన నిమిత్తం బుధవారం విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు విమానాశ్రయంలో కూటమి నేతలు, అధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.గణబాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ, తదితరులు ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం 11.30 గంటలకు ఆయన హెలికాప్టర్‌లో బయలుదేరి విజయనగరం జిల్లాకు వెళ్లారు.