Share News

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఘనస్వాగతం

ABN , Publish Date - Nov 30 , 2025 | 01:34 AM

నగరానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఘనస్వాగతం

తూర్పు నౌకాదళంలో కార్యక్రమానికి హాజరు

గోపాలపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

నగరానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శనివారం సాయంత్రం 4.40 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడకు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, వంశీకృష్ణ శ్రీనివాస్‌, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ కోన తాతారావు, పలువురు పార్టీ నేతలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన తూర్పు నౌకాదళ కేంద్రానికి వెళ్లారు. ‘సముద్రిక’ ఆడిటోరియంలో నిర్వహించిన ఇండియన్‌ నేవల్‌ సింఫనిక్‌ ఆర్కెస్ట్రా ‘సర్గం-2025’ కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్‌కల్యాణ్‌తో వెంట ఆయన కుమారుడు అకిరా నందన్‌ ఉన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 01:34 AM