సమస్యల పరిష్కారానికి వెలుగు వీఓఏల ధర్నా
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:39 PM
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వెలుగు వీఓఏలు మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అంతకుముందు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల సీఐటీయూ కార్యాలయం నుంచి నెహ్రూచౌక్, మీదుగా ర్యాలీ నిర్వహించారు.
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వెలుగు వీఓఏలు మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అంతకుముందు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల సీఐటీయూ కార్యాలయం నుంచి నెహ్రూచౌక్, మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్.రూపాదేవి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, వీఓఏల మూడేళ్ల కాలపరిమితి సర్క్యూలర్‌ను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని, వృత్తితో సంబంధం లేని ఇతర పనుల నుంచి వీఓఏలను మినహాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్‌డీఏ పీడీ శచీదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీరామ్, ఎస్.వెంకటలక్ష్మి, సీహెచ్‌ఎల్‌ఎన్ రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.