Share News

ఘనంగా వీఎంఆర్డీఏ క్రీడా ఉత్సవం

ABN , Publish Date - Aug 09 , 2025 | 10:25 PM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియంలో శనివారం క్రీడా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వీఎంఆర్డీఏ క్రీడా ఉత్సవం
బ్యాటింగ్‌ చేస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు

విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియంలో శనివారం క్రీడా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ ప్రణవ్‌గోపాల్‌, కమిషనర్‌ విశ్వనాథన్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌లతో పాటు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కుమార్తె శ్యామల దీపిక, క్రెడాయ్‌ పూర్వ ఛైర్మన్‌ ధర్మేంద్ర, తదితరులు పాల్గొన్నారు. క్రికెట్‌ మ్యాచ్‌లో భాగంగా పల్లా శ్రీనివాసరావు బౌలింగ్‌ చేయగా, వెలగపూడి, గణబాబు బ్యాటింగ్‌ చేశారు. అలాగే వీఎంఆర్డీఏ చైర్మన్‌, కమిషనర్‌ ఒకవైపు, ప్రజాప్రతినిధులు మరోవైపు ఉండి ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’ ఆడగా వీఎంఆర్‌డీఏ గ్రూప్‌ గెలిచింది. ఇలాంటి క్రీడల వల్ల ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వనాథ స్పోర్ట్స్‌ క్లబ్‌ ప్రతినిధి కాశీవిశ్వనాథం, సీఏవో హరిప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 10:25 PM