Share News

సెప్టెంబరు 5 నుంచి వైజాగ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

ABN , Publish Date - Aug 20 , 2025 | 01:09 AM

సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో వైజాగ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లో మంగళవారం దీనిపై సమావేశం నిర్వహించారు. పర్యాటక శాఖ అధికారులు, హోటళ్ల నిర్వాహకులు పలు సూచనలు చేశారు. ఆర్కే బీచ్‌రోడ్డులో వీఎంఆర్‌డీఏ పార్కు వెనుకనున్న ఎంజీఎం మైదానంలో ఆ మూడు రోజులు సాయంత్రం ఐదు నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఫుడ్‌ ఫెస్టివల్‌ ఉంటుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు.

సెప్టెంబరు 5 నుంచి వైజాగ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

వీఎంఆర్‌డీఏ పార్కు వెనుకనున్న ఎంజీఎం మైదానంలో నిర్వహణ

విశాఖపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి):

సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో వైజాగ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లో మంగళవారం దీనిపై సమావేశం నిర్వహించారు. పర్యాటక శాఖ అధికారులు, హోటళ్ల నిర్వాహకులు పలు సూచనలు చేశారు. ఆర్కే బీచ్‌రోడ్డులో వీఎంఆర్‌డీఏ పార్కు వెనుకనున్న ఎంజీఎం మైదానంలో ఆ మూడు రోజులు సాయంత్రం ఐదు నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఫుడ్‌ ఫెస్టివల్‌ ఉంటుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని స్టార్‌ హోటళ్లు ఇందులో పాల్గొంటాయని, చెఫ్‌లకు పోటీలు కూడా నిర్వహిస్తామని హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అధ్యక్షులు విజయమోహన్‌, హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి పవన్‌ కార్తీక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 01:09 AM