విశాఖ-రాయపూర్ హైవే త్వరగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:48 PM
విశాఖపట్నం- రాయపూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు కలెక్టర్ సూచన
సబ్బవరం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం- రాయపూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సంబంధిత అధికారులకు సూచించారు. మండలంలోని చిన్నయ్యపాలెం వద్ద జరుగుతున్న ఇంటర్ చేంజ్ (అనకాపల్లి- ఆనందపురం, విశాఖ- రాయపూర్ హైవేలు కలిసే చోట) పనులను మంగళవారం ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ సంతోశ్‌కుమార్ యాదవ్‌తో కలసి పరిశీలించారు. డీపీఆర్‌లో సూచించిన విధంగా సకాలంలో నిర్మాణ పనులు పూర్తి చేసి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ చెప్పారు. గ్రామాల వద్ద ప్రజల రాకపోకలకు, రైతులు పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా అవసరమైనచోట అండర్‌పాస్‌లు నిర్మించాలని సూచించారు. వీరి వెంట ఆర్డీవో షేక్ ఆయీషా, ఎన్‌హెచ్-16 ఎస్‌డీసీ జ్ఞానవేణి, తహశీల్దార్ బి.చిన్నికృష్ణ, ప్రాజెక్టు డైరెక్టర్ రోహిత్‌కుమార్, తదితరులు వున్నారు.