విశాఖ నా గుండెల్లో ఉంటుంది
ABN , Publish Date - Jul 24 , 2025 | 01:28 AM
విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తాను ఇక్కడి భీమిలి గెస్ట్‌హౌస్, సంగం, శరత్ థియేటర్‌ల ప్రాంతంలో నటన నేర్చుకున్నానని నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం ఆర్కే బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ తన పేరు పవనం అని, తిరుగుతూ ఉంటానన్నారు. ‘మనం పవనాలు అయితే అవి కూపస్థ మండూకాలు. అవి బావిలో కప్పలు. అవి అలానే మాట్లాడతాయి’ అంటూ ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ కొందరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విశాఖ తన గుండెల్లో ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.
నగరంతో ప్రత్యేక అనుబంధం
ఇక్కడి భీమిలి గెస్ట్ హౌస్,
సంగం, శరత్ థియేటర్ ప్రాంతాల్లో నటన నేర్చుకున్నా
సత్యానంద్ మాస్టారు ఉత్తరాంధ్ర
ఆట, పాటను అణువణువునా
నా గుండెల్లో నింపారు
‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో
హీరో, ఏపీ డిప్యూటీ సీఎం కె.పవన్ కల్యాణ్
విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి):
విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తాను ఇక్కడి భీమిలి గెస్ట్‌హౌస్, సంగం, శరత్ థియేటర్‌ల ప్రాంతంలో నటన నేర్చుకున్నానని నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం ఆర్కే బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ తన పేరు పవనం అని, తిరుగుతూ ఉంటానన్నారు. ‘మనం పవనాలు అయితే అవి కూపస్థ మండూకాలు. అవి బావిలో కప్పలు. అవి అలానే మాట్లాడతాయి’ అంటూ ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ కొందరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విశాఖ తన గుండెల్లో ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. ‘బైబైయ్యే బంగారు రమణమ్మా’..., ‘లబోలబో లబరి గాజులు’...పాటలు పాడిన పవన్ కల్యాణ్...తనకు నటనలో ఓనమాలు నేర్పిన సత్యానంద్ మాస్టారు ఉత్తరాంధ్ర, ఆట, పాట గుండెల్లో అణువణువూ నింపేశారన్నారు. సినిమాల గురించి చెప్పాలంటే తనకు సిగ్గు అన్నారు. అయితే డోలీ మోతలతో ఇబ్బందిపడే గ్రామాలకు రోడ్లు వేయించగలనని, తనను తిట్టే ప్రత్యర్థి పార్టీల సర్పంచులకు అడగకుండా నిధులు మంజూరు చేయగలనన్నారు. తనకు ఇవ్వడమే తప్ప అడగడం తెలియదన్నారు. సినిమాను ప్రేమించడం మాత్రమే తనకు తెలుసునన్నారు. తాను జీవితంలో ఒక స్థాయికి చేరుకునేందుకు అన్నయ్య, వదిన ఎంతగానో కృషిచేశారని, అందుకే గెలిచిన తరువాత వారి పాదాల వద్ద తన శిరస్సును పెట్టానన్నారు. తనకు అతిపెద్ద హిట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో రత్నం ఒక కథను చెప్పారన్నారు. ఈ సినిమాను 40 శాతం క్రిష్ డైరెక్ట్ చేశారని, కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్టు నుంచి పక్కకు వెళ్లిపోయినప్పటికీ జ్యోతి అద్భుతంగా డైరెక్ట్ చేశారన్నారు. తక్కువ సమయంలో ఎఫెక్టివ్‌గా సినిమాను తీసినట్టు వెల్లడించారు. కోహినూర్ వజ్రాన్ని తీసుకువచ్చే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు వంటివన్నీ ఆసక్తికరంగా చిత్రీకరించినట్టు తెలిపారు.