Share News

విశాఖ నగరం ప్రేమకు చిహ్నం

ABN , Publish Date - Dec 21 , 2025 | 01:17 AM

విశాఖ ప్రజల పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

విశాఖ నగరం ప్రేమకు చిహ్నం

  • ఇక్కడ ఏదో అద్భుతం ఉంది

  • దివంగత మాజీ ప్రధాని వాజపేయి విగ్రహావిష్కరణ సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

విశాఖపట్నం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ప్రజల పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆర్కే బీచ్‌రోడ్డులోని పార్క్‌ హోటల్‌ జంక్షన్‌లో అటల్‌ బిహారీ వాజపేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ నేతృత్వంలో ప్రతి జిల్లాలో వాజపేయి విగ్రహాలు పెట్టాలని చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదని ప్రశంసించారు. దీనికి చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌లు మద్దతు ఇవ్వడం మరింత గొప్ప విషయమన్నారు. విశాఖపట్నంలో ఏదో అద్భుతం ఉందని, నగరం ప్రేమకు చిహ్నమని అభివర్ణించారు. బీపీ, షుగర్‌ ఉన్నవారు విశాఖ వస్తే అవన్నీ నయమైపోతాయన్నారు. విశాఖ అభివృద్ధి చెందితే..ఉత్తరాంరఽధ మాత్రమే కాకుండా దేశమంతా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్‌రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామ్‌, బీజేపీ నాయకులు పాల్గొని ప్రసంగించారు.

Updated Date - Dec 21 , 2025 | 01:17 AM