గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ
ABN , Publish Date - Sep 06 , 2025 | 01:34 AM
గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.
త్వరలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు
సీఎం నారా చంద్రబాబునాయుడు
విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ‘ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్’ శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ పెడుతున్నదన్నారు. అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రియల్ టైమ్ డేటా టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక్క వాట్సాప్ ద్వారానే 700 సేవలు అందిస్తున్నామన్నారు.