Share News

పలు చోట్ల విజిలెన్స్‌ దాడులు

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:11 PM

మండలంలో పలు చోట్ల సోమవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. మేడివాడలో గల కిరాణా దుకాణంలో ఎరువులు, పీడీఎస్‌ బియ్యం నిల్వలు ఉన్నాయన్న సమాచారం మేరకు విజిలెన్స్‌, మండల వ్యవసాయాధికారి, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

పలు చోట్ల విజిలెన్స్‌ దాడులు
మేడివాడలోని కిరాణా దుకాణంలో ఎరువులు, పీడీఎస్‌ బియ్యం నిల్వలను పరిశీలిస్తున్న అధికారులు

ఎరువులు, పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

రావికమతం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలో పలు చోట్ల సోమవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. మేడివాడలో గల కిరాణా దుకాణంలో ఎరువులు, పీడీఎస్‌ బియ్యం నిల్వలు ఉన్నాయన్న సమాచారం మేరకు విజిలెన్స్‌, మండల వ్యవసాయాధికారి, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఆ దుకాణంలో అనుమతులు లేకుండా యూరియా, పొటాష్‌, ఎస్‌ఎస్‌పీ, అమోనియం సల్ఫేట్‌, తదితర ఎరువులతో పాటు పీడీఎస్‌ బియ్యం విక్రయిస్తున్నట్టు గుర్తించారు. కొనగళ్ల సురేశ్‌కు చెందిన కిరాణా దుకాణంలో బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 15 బియ్యం బస్తాలు, 9 అమోనియం సల్ఫేట్‌ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పసుమర్తి సంతోశ్‌ కిరాణా దుకాణంలో 20 బస్తాల పొటాష్‌, ఐదు బస్తాల ఎస్‌ఎస్‌పీ నిల్వ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ రెండు దుకాణాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఉన్న బియ్యం, ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి శంకర్‌లాల్‌నాయక్‌ తెలిపారు. పట్టుబడిన పీడీఎస్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు, ఎరువుల బస్తాలను వ్యవసాయాశాఖాధికారులకు అప్పగించామన్నారు. ఆ ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో మండల వ్యవసాయాధికారి రమేశ్‌బాబు, ఆర్‌ఐ ఐ.రమణ, వీఆర్వో సాంబమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

ఏటిగైరంపేటలో...

గొలుగొండ: మండలంలోని ఏటిగైరంపేట గ్రామంలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు సోమవారం దాడులు చేశారు. ఆ గ్రామంలో శ్రీవెంకటరాజా షాపులో ఎటువంటి బిల్లులు లేకుండా విక్రయిస్తున్న పొటాష్‌, సూపర్‌ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమానిపై కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్‌ ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

Updated Date - Sep 15 , 2025 | 11:11 PM