క్వారీల్లో విజిలెన్స్ తనిఖీలు!
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:29 AM
గనుల శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ ఏడీ అశోక్‌కుమార్ నేతృత్వంలో రాయి క్వారీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఒక ఎక్స్‌కవేటర్, 5 లారీలు సీజ్
అనకాపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): గనుల శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ ఏడీ అశోక్‌కుమార్ నేతృత్వంలో రాయి క్వారీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం అనకాపల్లి మండలం ఊడేరులో గంగరాజుకు చెందిన అనధికార క్వారీలో ఒక ఎక్స్‌కవేటర్‌ను సీజ్ చేశారు. వేటజంగాలపాలెంలో వే బిల్లులు, అనుమతులు లేకుండా రోడ్డు మెటల్ రవాణా చేస్తున్న ఐదు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటికి ఎంతెంత అపరాధ రుసుము విధించారో వెల్లడించాల్సి వుంది.