Share News

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:49 AM

పట్టణంలో శనివారం ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థానిక వ్యవసాయాధికారి మోహనరావుతో కలిసి విజిలెన్స్‌ ఎస్‌ఐ రవికుమార్‌, సిబ్బంది దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ తనిఖీలు
ఎలమంచిలిలోని ఎరువుల దుకాణంలో స్టాకును పరిశీలిస్తున్న అధికారులు

రికార్డులు, నిల్వల పరిశీలన

ఎలమంచిలి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో శనివారం ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థానిక వ్యవసాయాధికారి మోహనరావుతో కలిసి విజిలెన్స్‌ ఎస్‌ఐ రవికుమార్‌, సిబ్బంది దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. యూరియా, ఇతర ఎరువుల స్టాక్‌ లభ్యత రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, గొడౌన్‌లోని ఎరువుల నిల్వలను పరిశీలించినట్టు వ్యవసాయాధికారి మోహనరావు తెలిపారు. పట్టణంలోని మన గ్రోమోర్‌ సెంటర్‌లో కాంప్లెక్సు ఎరువులను తనిఖీ చేసి రికార్డులు, సరుకుకు వ్యత్యాసం ఉండడంతో 19 మెట్రిక్‌ టన్నుల ఎరువులకు స్టాప్‌ సేల్‌ ఇచ్చినట్టు తెలిపారు. అదే విధంగా గాయత్రి రైతు డిపో, శ్రీవేంకటేశ్వర రైతు డిపోలో తనిఖీలు చేశారు.

Updated Date - Sep 14 , 2025 | 12:49 AM