జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిగా వర్మ
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:06 PM
జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఎంఎస్‌వీఎస్‌పీ వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక కైరళీ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో సోమవారం జిల్లా 18వ మహాసభ జరిగింది. వివిధ మండలాల నుంచి 52 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
దేవరాపల్లి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఎంఎస్‌వీఎస్‌పీ వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక కైరళీ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో సోమవారం జిల్లా 18వ మహాసభ జరిగింది. వివిధ మండలాల నుంచి 52 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర నాయకులు కె.త్రిమూర్తులరెడ్డి, కె.శేషగిరిరావు మహాసభకు పరిశీలకులుగా వ్యవహరించారు. జిల్లాలో పర్యావరణం విధ్వంసాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా ఎంఎస్‌వీఎస్‌పీ వర్మ(కశింకోట), ప్రధాన కార్యదర్శిగా కె.వరప్రసాద్(ఎస్.రాయవరం), ఉపాధ్యక్షులుగా బీవీఎస్ వేణు(కె.కోటపాడు), బీఎస్ రామ్‌కుమార్ (అచ్యుతాపురం), కె.రాంబాబు (దేవరాపల్లి), అలాగే గౌరవ అధ్యక్షునిగా ఎంకే దినేశ్, మరో ఏడుగురు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.