సీలేరు కాంప్లెక్సు సీఈగా వెంకట రాజారావు బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:40 PM
సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజనీర్‌గా కె.వెంకట రాజారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ గతంలో సీఈగా పని చేసిన ఎల్‌వీ స్వామినాయుడు గత నెలలో పదవీ విరమణ పొందారు.
సీలేరు, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజనీర్‌గా కె.వెంకట రాజారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ గతంలో సీఈగా పని చేసిన ఎల్‌వీ స్వామినాయుడు గత నెలలో పదవీ విరమణ పొందారు. ఈ మేరకు సీలేరు కాంప్లెక్సు ఓఅండ్‌ఎం సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్న కామేశ్వరరావుకు ఇన్‌చార్జి బాధ్యతలను జెన్‌కో ఉన్నతాధికారులు అప్పగించారు. విజయవాడ విద్యుత్ సౌదాలో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కె.వెంకట రాజారావుకు చీఫ్ ఇంజనీర్‌గా పదోన్నతి కల్పించి సీలేరు కాంప్లెక్సు బదిలీ చేస్తూ జెన్‌కో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సీలేరు కాంప్లెక్సు ఓఅండ్‌ఎం, సివిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు చిన్న కామేశ్వరరావు, చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈలు బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్‌తో పాటు పలువురు ఇంజనీర్లు, సిబ్బంది స్వాగతం పలికారు.