Share News

అరకులోయలో ఘనంగా వెంకన్న కల్యాణోత్సవాలు

ABN , Publish Date - May 11 , 2025 | 12:59 AM

అరకులోయలో వేంకటేశ్వర స్వామి కల్యాణమహోత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సం గురువారం రాత్రి వైభవంగా జరిగిన విషయం విదితమే. శనివారం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆభరణాలు, పూలతో అలంకరించి, ప్రత్యేక వాహనంలో అరకులోయ పట్టణంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ, ఉత్సవ కమిటీ చైర్మన్లు పెట్టెలి దాసుబాబు, సివేరి బాలకృష్ణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

అరకులోయలో ఘనంగా వెంకన్న కల్యాణోత్సవాలు
ఉభయ దేవేరులతో అరకులోయలో ఊరేగుతున్న వేంకటేశ్వరస్వామి

ఉభయ దేవేరులతో ఊరేగిన స్వామివారు

ఘనంగా ముగిసిన మహోత్సవం

అరకులోయ, మే 10 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో వేంకటేశ్వర స్వామి కల్యాణమహోత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సం గురువారం రాత్రి వైభవంగా జరిగిన విషయం విదితమే. శనివారం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆభరణాలు, పూలతో అలంకరించి, ప్రత్యేక వాహనంలో అరకులోయ పట్టణంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ, ఉత్సవ కమిటీ చైర్మన్లు పెట్టెలి దాసుబాబు, సివేరి బాలకృష్ణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఊరేగింపు సందర్భంగా పలువురు కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. మెయిన్‌ రోడ్డుపై ఏర్పాటు చేసిన వేదికలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Updated Date - May 11 , 2025 | 12:59 AM