7 నుంచి వెంకన్న కల్యాణోత్సవం
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:48 PM
ఏటా నిర్వహిస్తున్నట్టుగానే ఈసారి కూడా మే 7 నుంచి 11వ తేదీ వరకు వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని పెదలబుడు సర్పంచ్, ఆలయ కమిటీ చైర్మన్ పెట్టెలి దాసుబాబు కోరారు.
నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహణ
అందరూ సహకరించాలి
ఆలయ కమిటీ చైర్మన్ దాసుబాబు
అరకులోయ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ఏటా నిర్వహిస్తున్నట్టుగానే ఈసారి కూడా మే 7 నుంచి 11వ తేదీ వరకు వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని పెదలబుడు సర్పంచ్, ఆలయ కమిటీ చైర్మన్ పెట్టెలి దాసుబాబు కోరారు. మంగళవారం సాయంత్రం ఆయన జడ్పీ అతిథి గృహంలో ఉత్సవ కమిటీ చైర్మన్ బాలకృష్ణతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఉత్సవాన్ని గత ఇరవై ఏళ్లుగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పట్టణంలోని వర్తకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా మే 8న స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.