Share News

పాడేరు ఘాట్‌లో వ్యాన్‌ బోల్తా

ABN , Publish Date - Jul 23 , 2025 | 11:21 PM

మన్యం నుంచి మైదాన ప్రాంతానికి పనసకాయల లోడుతో వెళుతున్న వ్యాన్‌ అదుపు తప్పి బుధవారం సాయంత్రం పాడేరు ఘాట్‌లోని గరికిబంధ మలుపు వద్ద బోల్తా పడింది.

పాడేరు ఘాట్‌లో వ్యాన్‌ బోల్తా
గరికిబంద సమీపంలో బోల్తా పడిన పనసకాయలు తరలిస్తున్న వ్యాన్‌

పాడేరురూరల్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): మన్యం నుంచి మైదాన ప్రాంతానికి పనసకాయల లోడుతో వెళుతున్న వ్యాన్‌ అదుపు తప్పి బుధవారం సాయంత్రం పాడేరు ఘాట్‌లోని గరికిబంధ మలుపు వద్ద బోల్తా పడింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... విజయవాడకు చెందిన పనసకాయల వ్యాపారి పాడేరు మండలంలోని వివిధ గ్రామాల్లో పనసకాయలు కొనుగోలు చేసి వ్యాన్‌లో విజయవాడకు తరలిస్తున్నారు. పాడేరు ఘాట్‌లో గరికిబంధ రెండవ మలుపు వద్ద సాయంత్రం 5 గంటల సమయంలో వ్యాన్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో అతనిని చోడవరం ఆస్పత్రికి తరలించారు. క్లీనర్‌ అనిల్‌ సురక్షితంగా బయటపడ్డాడు.

Updated Date - Jul 23 , 2025 | 11:21 PM