జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌గా వంపూరు గంగులయ్య
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:44 AM
రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌గా జనసేన నేత వంపూరు గంగులయ్యను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలకు నామినేటెడ్ పదవులు కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 31 సంస్థలకు చైర్మన్లుగా నియమించింది. ఇందులో భాగంగా పాడేరుకు చెందిన జనసేన అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంపూరు గంగులయ్యకు రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌గా అవకాశం కల్పించింది.
- జనసేన నేతకు రాష్ట్ర స్థాయి పదవి దక్కడంపై పార్టీ శ్రేణుల ఆనందం
పాడేరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌గా జనసేన నేత వంపూరు గంగులయ్యను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలకు నామినేటెడ్ పదవులు కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 31 సంస్థలకు చైర్మన్లుగా నియమించింది. ఇందులో భాగంగా పాడేరుకు చెందిన జనసేన అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంపూరు గంగులయ్యకు రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌గా అవకాశం కల్పించింది. గిరిజన ప్రాంతంలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న గంగులయ్యను గతంలో జీసీసీ, ట్రైకార్ డైరెక్టర్‌గా నియమించినప్పటికీ ఆయన నిరాకరించారు. దీంతో తాజాగా నామినేటెడ్ పోస్టుల్లో ఆయనకు చైర్మన్ స్థాయి పదవి ఇచ్చారు. ఆయనకు రాష్ట్ర స్థాయి పదవి దక్కడంపై జిల్లాలోని జనసేన నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.