4,217 మంది ఆటోవాలలకు ‘వాహన మిత్ర’
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:48 PM
జిల్లాలో 4,217 మంది ఆటోవాలలకు వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఆటో స్టాండ్‌ల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
నేడు ఒక్కొక్కరికి ఖాతాలో రూ.15 వేలు జమ
పాడేరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 4,217 మంది ఆటోవాలలకు వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఆటో స్టాండ్‌ల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆటోలు, టాక్సీలు నడుపుకొని జీవనం సాగిస్తున్న వారికి ఏడాదికి రూ.15వేలు అందిస్తూ ప్రోత్సహించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని ప్రకటించింది. దీంతో జిల్లాలోని 22 మండలాల పరిధిలో మొత్తం 4,641 మంది టాక్సీవాలలు దరఖాస్తులు చేయగా.. వాటిలో అనర్హులైన 424 మందిని తొలగించారు. మిగిలిన 4,217 మందిని వాహన మిత్ర పథకానికి ఎంపిక చేశారు. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున రూ.63 కోట్ల 2 లక్షల 55 వేలు శనివారం జమ కానుంది.