వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపాల్‌కు అస్వస్థత
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:50 PM
చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు కార్యాలయంలో శుక్రవారం రివ్యూ మీటింగ్‌కు హాజరైన వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపాల్ అన్నపూర్ణ స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను వెంటనే చోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బుచ్చెయ్యపేట జూన్ 27(ఆంధ్రజ్యోతి): చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు కార్యాలయంలో శుక్రవారం రివ్యూ మీటింగ్‌కు హాజరైన వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపాల్ అన్నపూర్ణ స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను వెంటనే చోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వడ్డాది కేజీబీవీలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు డిమాండ్ ఉంది. సీట్ల విషయంలో రాజకీయ జోక్యం కూడా పెరిగింది. మిగులు సీటు విషయమై తాము సిఫారసు చేసిన వారికి ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రిన్సిపాల్‌కు కబురు వచ్చింది. ఆమె శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లగా ఎమ్మెల్యే నిలదీసినట్టు సమాచారం. దీంతో ఆమె భయాందోళనకు గురై స్పృహ తప్పి పడిపోయినట్టు తెలిసింది. ఆమెను వెంటనే చోడవరం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నారు.