Share News

పొదుపుగా నీటి వినియోగం

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:31 PM

బలిమెల జలాశయం నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆంధ్ర, ఒడిశా అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై బుధవారం రెండు రాష్ర్టాల అధికారులు సీలేరు ఏపీ జెన్‌కో అతిథి గృహంలో సమావేశమయ్యారు.

పొదుపుగా నీటి వినియోగం
జెన్‌కో అతిథి గృహంలో సమావేశమైన ఆంధ్ర, ఒడిశా అధికారులు

బలిమెల జలాశయం నీటి వినియోగంపై సమీక్షలు ఆంధ్ర, ఒడిశా అధికారుల నిర్ణయం

సీలేరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): బలిమెల జలాశయం నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆంధ్ర, ఒడిశా అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై బుధవారం రెండు రాష్ర్టాల అధికారులు సీలేరు ఏపీ జెన్‌కో అతిథి గృహంలో సమావేశమయ్యారు. 2024-2025 నీటి సంవత్సరంలో ఆంధ్రా కంటే ఒడిశా 4.8847 టీఎంసీలు ఎక్కువ వినియోగించుకుందని, అలాగే 2025-26 నీటి సంవత్సరం జూలైలో ఒడిశా 8.8756 టీఎంసీలు వినియోగించుకుందన్నారు. 2024-2025లో అధికంగా వినియోగించుకున్న నీటితో కలిపి ఒడిశా 13.7603 టీఎంసీలను వినియోగించుకుందని నిర్ధారించారు. ఆంధ్రా తన వాటాగా 2025-2026 నీటి సంవత్సరం జూలైలో 4.8669 టీఎంసీలను వినియోగించుకున్నట్టు లెక్కలు తేల్చారు. దీని ప్రకారం ఆంధ్రా కంటే ఒడిశా 8.8934 టీఎంసీల నీటిని ఎక్కువ వినియోగించుకున్నట్టు తేల్చారు. ప్రస్తుతం బలిమెలలో 23.1750 టీఎంసీలు, జోలాపుట్‌లో 24.0611 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, ఆగస్టు నెలాఖరు నాటికి బలిమెల జలాశయంలోకి నదీ పరివాహక ప్రాంతం నుంచి 10.5000 టీఎంసీలు, జోలాపుట్‌ జలాశయంలోకి 8 టీఎంసీల నిల్వలు వచ్చి చేరతాయని, వీటితో కలిపి రెండు జలాశయాల్లో మొత్తం 65.7361 టీఎంసీల నీటి నిల్వలు ఉంటాయని ఇరు రాష్ర్టాల అధికారులు లెక్కలు కట్టారు. ఇందులో ఆంధ్రా వాటాగా 37.3148 టీఎంసీలుగా, ఒడిశా వాటా 28.4213 టీఎంసీలుగా నీటి పంపకాలు జరిపారు. ప్రస్తుతం ఇరు రాష్ర్టాల విద్యుత్‌ ఉత్పత్తి అవసరాల నిమిత్తం ఆంధ్రాకు 2500 క్యూసెక్కుల నీటిని, ఒడిశాకు 4000 క్యూసెక్కుల నీటిని బలిమెల నుంచి విడుదల చేయడానికి ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో ఒడిశా తరఫున ఒడిశా హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ బలిమెల జనరల్‌ మేనేజర్‌ అక్షయ్‌కుమార్‌ సాహో, సుదిక్త రంజన్‌నాయక్‌ (మేనేజర్‌), ఆనందరావు(అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌), సబదీప్‌ పాండా(అసిస్టెంట్‌ మేనేజర్‌), ఒడిశా వాటర్‌ రీసొర్స్‌ అధికారులు దిలీప్‌కుమార్‌ దాలాబెహరా(ఏఈఈ), అర్జున హేంబ్రం (ఎస్టిమేటర్‌), గడాధర్‌ ప్రధాన్‌ (ఏఈఈ), కేసీ పాణి (ఏఈఈ) పాల్గొన్న, ఆంధ్ర తరఫున ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు చిన్నకామేశ్వరరావు(ఓఅండ్‌ఎం), బి.చంద్రశేఖర్‌రెడ్డి (సివిల్‌), ఈఈలు సీహెచ్‌ నాగశ్రీనివాస్‌, వి.రాజేంద్రప్రసాద్‌, ఎస్‌.జైపాల్‌(డీఈఈ), సీహెచ్‌ సురేశ్‌(ఏఈఈ) పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 11:31 PM