Share News

సాగర్‌నగర్‌లో నగర వనం

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:29 AM

సాగర్‌నగర్‌లో నగర వనం ఏర్పాటుకు అటవీ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకు సుమారు రెండు కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు. విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో సముద్ర తీరం వైపు అటవీ శాఖకు సుమారు 50 ఎకరాలు (జూ వెనుక గేటు నుంచి రుషికొండ రాడిసన్‌ బ్లూ హోటల్‌ వరకూ) ఉంది.

సాగర్‌నగర్‌లో నగర వనం

రూ.2 కోట్లతో సైక్లింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌, యాంపీ థియేటర్‌ ఏర్పాటుకు

అటవీశాఖ ప్రతిపాదన

విశాఖపట్నం/సాగర్‌నగర్‌,

ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి):

సాగర్‌నగర్‌లో నగర వనం ఏర్పాటుకు అటవీ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకు సుమారు రెండు కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు. విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో సముద్ర తీరం వైపు అటవీ శాఖకు సుమారు 50 ఎకరాలు (జూ వెనుక గేటు నుంచి రుషికొండ రాడిసన్‌ బ్లూ హోటల్‌ వరకూ) ఉంది. సాగర్‌నగర్‌ ముఖద్వారం ఎదురుగా షెల్టర్‌ బెల్టులో సరుగుడు తోటలు వేశారు. ఆ పక్కనే ఉన్న సుమారు 20 ఎకరాల్లో నగర వనాన్ని ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. సాగర్‌నగర్‌తో పాటు దానికి ఆనుకుని ఉన్న కాలనీల ప్రజల కోసం నగరవనంలో సైక్లింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌, యాంపీ థియేటర్‌, యోగా సెంటర్‌, కేఫిటేరియా, తదితర సదుపాయాలను కల్పించాలని అధికారులు నిర్ణయించారు. చెట్ల పెంపకాన్ని కూడా చేపడతారు. స్థానికంగా ఉండే వన సంరక్షణ సమితుల ఆధ్వర్యంలో నగర వనాలను నిర్వహిస్తారు. ప్రజలకు ఆహ్లాదం కలిగేలా నగర వనాలను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వీటిని నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది.

Updated Date - Apr 11 , 2025 | 01:29 AM