రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:46 PM
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సింహాచలం రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గోపాలపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సింహాచలం రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం పాత గోపాలపట్నం వద్ద గల ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించినా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. రైలు నుంచి జారిపడడం వల్ల గానీ ట్రాక్ దాటుతున్న సమయంలో ఏదైనా రైలు ఢీకొనడంతో ఈ వ్యక్తి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుడి సుమారు 45 ఏళ్లు ఉంటాయని, టీషర్ట్, షార్టు ధరించి ఉన్నట్టు వారు తెలిపారు. మృతుని సంబంధీకులు ఎవరైనా ఉంటే జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ ఎస్.రామారావు తెలిపారు.