15లోగా అసంపూర్తి భవనాలు పూర్తి
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:07 PM
మండలంలో అసంపూర్తిగా ఉన్న పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలను వచ్చే నెల 15లోగా పూర్తి చేసి అప్పగించాలని అధికారులను ఐటీడీఏ పీవో ఆదేశించారు.
అరమ గ్రామంలో హెల్త్ సెంటర్, గోలంబ గ్రామంలో మల్టీ పర్పస్ సెంటర్, డుంబ్రిగుడలోని టీడబ్ల్యూ హాస్టల్‌ను అప్పగించాలి
అధికారులకు ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశం
డుంబ్రిగుడ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలో అసంపూర్తిగా ఉన్న పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలను వచ్చే నెల 15లోగా పూర్తి చేసి అప్పగించాలని అధికారులను ఐటీడీఏ పీవో ఆదేశించారు. బుధవారం ఆమె మండలంలో పలు అసంపూర్తి భవనాలను పరిశీలించారు. ఇందులో భాగంగా అరమ గ్రామంలో హెల్త్ సెంటర్, గోలంబ గ్రామంలో మల్టీ పర్పస్ సెంటర్, డుంబ్రిగుడలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హాస్టల్ భవనం, కోర్రా పంచాయతీలో అంగన్‌వాడీ సెంటర్‌ను పరిశీలించారు. వీటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే నెల 15లోగా అప్పగించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఆమె వెంట టీడబ్ల్యూ ఏఈ అభిషేక్, సీడీపీవో ఏస్తేరు రాణి, తదితరులు ఉన్నారు.