లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:29 AM
నగర పరిధిలోని 96 హోటళ్లు/లాడ్జిల్లో ఆదివారం రాత్రి పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో బస చేసిన వారిలో ఏదైనా కేసులో పరారీలో ఉన్న నిందితులు ఎవరైనా ఉన్నారా?, ఎన్‌బీడబ్ల్యూ పెండింగ్‌లో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా?, విదేశీయులైతే సక్రమంగా పత్రాలు కలిగి ఉన్నారా?, లేదా?, మైనర్లు ఎవరైనా గదుల్లో బస చేశారా?, హోటల్‌కు అన్నిరకాల అనుమతులు ఉన్నాయా?...అనే అంశాలపై ప్రధానంగా దృష్టిసారించారు.

విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):
నగర పరిధిలోని 96 హోటళ్లు/లాడ్జిల్లో ఆదివారం రాత్రి పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో బస చేసిన వారిలో ఏదైనా కేసులో పరారీలో ఉన్న నిందితులు ఎవరైనా ఉన్నారా?, ఎన్‌బీడబ్ల్యూ పెండింగ్‌లో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా?, విదేశీయులైతే సక్రమంగా పత్రాలు కలిగి ఉన్నారా?, లేదా?, మైనర్లు ఎవరైనా గదుల్లో బస చేశారా?, హోటల్‌కు అన్నిరకాల అనుమతులు ఉన్నాయా?...అనే అంశాలపై ప్రధానంగా దృష్టిసారించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అనుమతులు లేని హోటళ్లు/లాడ్జిలు 42, ట్రేడ్ లైసెన్స్‌లు లేనివి 12, ఫుడ్‌లైసెన్స్ లేనివి 12, జీఎస్టీ సర్టిఫికెట్ లేనివి 17, సందర్శకుల రికార్డులు నిర్వహించనవి రెండు, వీఎంఎస్ అప్‌డేట్ చేయనవి 14, సీసీ టీవీలు లేనివి రెండు ఉన్నట్టు గుర్తించారు. వీటిపై చట్టపరంగా కేసులు నమోదుచేసి చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రతబాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు.