Share News

యారాడలో ఇద్దరు యువకుల గల్లంతు

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:08 AM

సముద్ర స్నానానికి ఉపక్రమించిన వారిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

యారాడలో ఇద్దరు యువకుల గల్లంతు

సముద్రంలో స్నానం చేస్తుండగా ప్రమాదం

మల్కాపురం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):

సముద్ర స్నానానికి ఉపక్రమించిన వారిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం యారాడ వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి...

గాజువాకకి చెందిన తొమ్మిదిమంది స్నేహితులు ఆదివారం ఉదయం యారాడ తీరానికి చేరుకుని, కొద్దిసేపు సరదాగా గడిపారు. మధ్యాహ్నం స్నానానికని సముద్రంలో దిగారు. కొద్దిసేపటికి గణేష్‌ (18), పవన్‌ (22) కెరటాల తాకిడికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్నేహితులు రక్షించాలని కేకలు వేశారు. సమీపంలో లైఫ్‌గార్డ్స్‌ లేకపోవడంతో అక్కడికి కొద్దిదూరంలో ఉన్న వారి వద్దకు వెళ్లి ఘటనను వివరించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, గాలించినా ఫలితం కనిపించలేదు. సమాచారం మేరకు పోలీసులు తీరానికి చేరుకుని వివరాలను సేకరించారు. గల్లంతైన యువకుల కోసం ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారిలో పవన్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, గణేష్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతున్నాడు. ఘటనపై న్యూపోర్టు సీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 20 , 2025 | 12:08 AM