Share News

రెండు పల్లె వెలుగు బస్సు సర్వీసులు ప్రారంభం

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:15 PM

పాడేరు ఆర్టీసీ డిపో నుంచి రెండు పల్లె వెలుగు బస్సు సర్వీసులను మంగళవారం ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ సియ్యారి దొన్నుదొర ప్రారంభించారు. బాకూరు- చీకుమద్దెల, పాడేరు- లోతేరు గ్రామాలకు ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి.

రెండు పల్లె వెలుగు బస్సు సర్వీసులు ప్రారంభం
బాకూరు- చీకుమద్దెల పల్లె వెలుగు సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తున్న దొన్నుదొర

పాడేరురూరల్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): పాడేరు ఆర్టీసీ డిపో నుంచి రెండు పల్లె వెలుగు బస్సు సర్వీసులను మంగళవారం ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ సియ్యారి దొన్నుదొర ప్రారంభించారు. బాకూరు- చీకుమద్దెల, పాడేరు- లోతేరు గ్రామాలకు ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దొన్నుదొర మాట్లాడుతూ జిల్లాలో రహదారి సౌకర్యం ఉన్న ప్రతీ మారుమూల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమన్నారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చే మారుమూల గ్రామాల రహదారులను మెరుగుపరిచి బస్సు సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి టి.ఉమామహేశ్వరరెడ్డి, పాడేరు డిపో సిస్టం సూపర్‌వైజర్‌ బీఆర్‌బీ ప్రసాద్‌, డిపో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ కేవీఎస్‌ఎన్‌.రాజు, ఎస్‌డీఐ ఎస్‌కేఐ.వల్లి, బాకూరు పంచాయతీ సర్పంచ్‌ బాకూరు వెంకటరమణరాజుతో పాటు ఆరు పంచాయతీల సర్పంచులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:15 PM