వేర్వేరు ప్రాంతాల్లో రెండు లారీలు బోల్తా
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:03 PM
మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు లారీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం సుమారు ఐదు గంటల సమయంలో ఓ లారీ జీకేవీధి వైపు వెళుతూ దుచ్చరపాలెం బ్రిడ్జి వద్ద అదుపుతప్పి 50 మీటర్లు లోయలోకి బోల్తా పడింది.
డ్రైవర్లకు గాయాలు
గూడెంకొత్తవీధి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు లారీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం సుమారు ఐదు గంటల సమయంలో ఓ లారీ జీకేవీధి వైపు వెళుతూ దుచ్చరపాలెం బ్రిడ్జి వద్ద అదుపుతప్పి 50 మీటర్లు లోయలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. అలాగే సప్పర్లలో మరో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. లారీలో కూలీలు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.