అధ్వాన రహదారితో అవస్థలు
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:57 AM
ఇది మండలంలో రావాడ పంచాయతీ సోమునాయుడుపాలెం నుంచి కలపాక పంచాయతీ స్వయంభూవరం వరకు వున్న రహదారి. పలుచోట్ల రాళ్లు తేలి, గోతులతో దారుణంగా తయారైంది. భారీ వర్షం కురిస్తే గెడ్డ ద్వారా వచ్చే నీరు రోడ్డు మీదుగా పారుతుండడంతో కోతకు గురవుతున్నది.
ఇబ్బందులు పడుతున్న పలు గ్రామాల ప్రజలు
రూ.80 లక్షలు మంజూరైనా ప్రారంభం కాని పనులు
ఇది మండలంలో రావాడ పంచాయతీ సోమునాయుడుపాలెం నుంచి కలపాక పంచాయతీ స్వయంభూవరం వరకు వున్న రహదారి. పలుచోట్ల రాళ్లు తేలి, గోతులతో దారుణంగా తయారైంది. భారీ వర్షం కురిస్తే గెడ్డ ద్వారా వచ్చే నీరు రోడ్డు మీదుగా పారుతుండడంతో కోతకు గురవుతున్నది. గోతుల రాత్రిపూట ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇరువైపులా డ్రైనేజీ కాలువలకు, రోడ్డుకు మధ్యలో గట్టులా మట్టి పేరుకుపోవడంతో వర్షం కురిస్తే నీరంతా రహదారిపై నిలిచిపోతున్నది. ఈ రోడ్డు దుస్థితిని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మూడు నెలల క్రితం నాబార్డు నిధులు రూ.80 లక్షలు మంజూరయ్యాయి. కానీ ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. దీనిపై పీఆర్ (ప్రాజెక్టులు) ఈఏ రాజ్‌కుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. గత నెలలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని, వర్షాల కారణంగా కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టలేదని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన పనులు మొదలవుతాయన్నారు.
-పరవాడ/ఆంధ్రజ్యోతి